అలంకార ప్రాయంగా మారిన షాపింగ్ కాంప్లెక్స్‌పై స్థానికుల ఆగ్రహం

 

సామర్లకోట: పట్టణంలోని బుధవారం సంత మార్కెట్ సెంటర్ వద్ద లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ అలంకారప్రాయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, కొద్ది


పాటి పనులను పూర్తి చేయకుండా అధికారులు వదిలివేయడంతో భవనం నిరుపయోగంగా మారిందని ఆరోపిస్తున్నారు. పట్టణంలో వ్యాపార దుకాణాలకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో షాపింగ్ కాంప్లెక్స్ వినియోగంలోకి రాలేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రదేశం మందుబాబులకు అడ్డాగా మారుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. వెంటనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...