ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాల విడుదలకు తేదీలు ఖరారు

 

కాకినాడ, మే 23: జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈఏపీసెట్)-2026 ఆన్లైన్ ప్రాథమిక కీ విడుదల తేదీలను అధికారులు ప్రకటించారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన ప్రాథమిక కీని ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనుండగా, అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 27వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగాల ప్రాథమిక కీని ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు విడుదల చేసి, అభ్యంతరాలను 27వ తేదీ వరకు స్వీకరించనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు పరిశీలించాలని కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాద్ గారు తెలిపారు.

Comments

Popular posts from this blog

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష

ద్వారంపూడి హయాంలో కాకినాడ అరాచకాలకు నిలయం: టీడీపీ నేతలు