చేపల మార్కెట్‌తో చుట్టుముడుతున్న సమస్యలు – తరలింపునకు ప్రజలు డిమాండ్
కాకినాడ రూరల్ : వాకలపూడి గ్రామంలోని గంగాలమ్మ ఆలయం వద్ద రోడ్డు మార్జిన్‌లో అనధికారికంగా నిర్వహిస్తున్న చేపల మార్కెట్‌ను తక్షణం తొలగించాలని ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక గ్రామస్తులు ఎమ్మెల్యే పంతం నానాజీని కోరారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు సుధీర్, కార్యదర్శి శ్రీనివాస్, మనోజ్ మాట్లాడుతూ చేపల మార్కెట్ కారణంగా నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పాటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, రహదారిపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మార్కెట్‌లో చేపల వ్యర్థాలను రోడ్డుపైనే పడేస్తుండటంతో దుర్వాసన వెదజల్లుతోందని, దోమలు, ఈగలు పెరిగి స్థానికంగా నివసించే ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల రాకపోకలకు, పారిశుద్ధ్యానికి ఇబ్బందిగా మారిన చేపల మార్కెట్‌ను ఇప్పటికే కేటాయించిన మార్కెట్ యార్డుకు తరలించేలా పంచాయతీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కెట్‌ను అక్కడికి తరలిస్తే ట్రాఫిక్ సమస్యతో పాటు పారిశుద్ధ్య సమస్యలు కూడా పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజ్జిబాబు, నరేష్, అపార్ట్మెంట్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment