గైగోలుపాడులో బిర్లా పెయింట్స్ వాణిజ్య సంస్థ ప్రారంభం
కాకినాడ రూరల్ : వ్యవసాయంతో పాటు వ్యాపార రంగంలోనూ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమకంటూ స్థిరమైన వ్యాపారాలను ఏర్పాటు చేసుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. ఆదివారం గైగోలుపాడులో నిమ్మన రమేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బిర్లా సంస్థ పెయింట్స్ వాణిజ్య సంస్థను ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత, విశ్వసనీయతకు ప్రాధాన్యమిచ్చే ప్రతిష్టాత్మక సంస్థ ఆధ్వర్యంలో వాణిజ్య సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.తన మిత్రుడు, గతంలో ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి ఒక సందర్భంలో ప్రతి ఒక్కరికీ సొంతంగా ఒక స్థిరమైన, స్థాపితమైన వ్యాపారం ఉండాలని సూచించిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం కంటే దానికి మంచి పేరు, విశ్వసనీయత తీసుకురావడం ఎంతో కష్టంతో కూడుకున్నదని, నిరంతర శ్రమ, నాణ్యతతోనే సంస్థలు ప్రజల్లో గుర్తింపు పొందుతాయని పేర్కొన్నారు. ప్రమాణాలతో కూడిన సంస్థల అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఇంజనీరింగ్ రంగంతో పాటు ప్రభుత్వపరమైన వ్యవహారాల్లోనూ సంస్థల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. నాణ్యతతో పనిచేసే సంస్థలను ఎక్కడైనా, ఎవరైనా ప్రోత్సహించడంతో పాటు వాటి అభివృద్ధికి సిఫారసు చేయాల్సిన అవసరం ఉందన్నారు.యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా వ్యాపార రంగంలో ఉన్న అవకాశాలను కూడా అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా రిటైల్ కౌంటర్లను చిన్నస్థాయి వ్యాపారాలుగా భావించకుండా భవిష్యత్తులో వాటిని పెద్ద వాణిజ్య సంస్థలుగా అభివృద్ధి చేసుకునే అవకాశాలుగా చూడాలని అన్నారు. వాణిజ్య రంగం దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని, స్వయం ఉపాధి, వ్యాపారాభివృద్ధి దిశగా యువత ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బస్సా చంటి బాబు, మానేపల్లి బాబ్జీ, దీనవహి పేరుబాబు, పుల్ల శ్రీరాములు, పుల్ల శ్రీను, ముద్దన ప్రకాశ్, పుల్ల వీరబాబు, పుల్ల బుల్లిరాజు తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment