నగరానికి ఆల్ ఈజ్ వెల్ సంస్థ వరం : అడబాల
కాకినాడ నగరంలో సామాజికవేత్త కిషోర్ సారథ్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఆల్ ఈజ్ వెల్ సేవలు అభినందనీయమని బోటు క్లబ్ వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. బోటు క్లబ్ ఉద్యానవనంలో ఆల్ ఈజ్ వెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా నగరంలో వందలాది మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు ఆల్ ఈజ్ వెల్ సభ్యులు విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. అలాగే ఉద్యానవనాలలో చెత్త తొలగించడం, గోడలకు అంటించిన పోస్టర్లను శుభ్రం చేయించడం వంటి అనేక సేవా కార్యక్రమాలను ఈ స్వచ్ఛంద సంస్థ నిరంతరం నిర్వహిస్తోందన్నారు. కాకినాడ నగరానికి ఆల్ ఈజ్ వెల్ సంస్థ ఒక గొప్ప వరమని అడబాల రత్న ప్రసాద్ తెలిపారు.

Comments
Post a Comment