వడదెబ్బతో పంచాయతీ కార్మికుడు మృతి
కాకినాడ రూరల్ మండలం సర్పవరం పంచాయతీకి చెందిన కార్మికుడు గుర్రం అప్పన్న (38) వడదెబ్బకు గురై మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. రాజారాం రత్ననగర్ గుడరిగుంటకు చెందిన అప్పన్న శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భావన్నారాయణపురం అంగనవాడీ కేంద్రం సమీపంలో పనులు చేస్తుండగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే అతన్ని కాకినాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్పవరం ఏఎస్ఐ నాగేశ్వరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సర్పవరం ఇన్‌స్పెక్టర్ సీహెచ్ ప్రకాశ్ తెలిపారు.
Comments
Post a Comment